బుమ్రాకు విశ్రాంతి?!

బుమ్రాకు విశ్రాంతి?!రాంచి : ఇంగ్లాండ్‌తో నాల్గో టెస్టులో భారత పేస్‌ దళపతి జశ్‌ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది. తొలి మూడు టెస్టుల్లో రివర్స్‌ స్వింగ్‌తో ఇంగ్లాండ్‌ను వణికించిన బుమ్రా.. శుక్రవారం నుంచి ఆరంభం కానున్న నాల్గో టెస్టుకు బెంచ్‌కు పరిమితం కానున్నాడని సమాచారం. అతడి స్థానంలో ముకేశ్‌ కుమార్‌ తుది జట్టులో ఆడే సూచనలు ఉన్నాయి. ధర్మశాల వేదికగా చివరి టెస్టుకు బుమ్రా బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. ఇక గాయంతో గత రెండు టెస్టులకు దూరమైన కెఎల్‌ రాహుల్‌.. రాంచి టెస్టుకు అందుబాటులోకి రానున్నాడు. సెలక్టర్లు అతడిని జట్టులోకి ఎంపిక చేసినా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ లేమి కారణంగా రాజ్‌కోట్‌ టెస్టుకు దూర మయ్యాడు. రజత్‌ పటీదార్‌ స్థానంలో కెఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ లైనప్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలో నిలిచింది.