– తొలి రేసులోనే పోడియం ఫినిషింగ్
– ఎఫ్‌ఐం ఈ ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్
ఒసాక (జపాన్) : ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్ 2024 తొలి రేసులో భారత జట్టు ఇండీ రేసింగ్ పోడియం ఫినిషింగ్ ప్రదర్శనతో మెప్పించింది. జపాన్‌లోని ఒసాకలో జరిగిన సీజన్ తొలి రేసులో ఇండీ రేసింగ్ రేసర్లు శాండ్ర గోమేజ్, స్పెన్సర్ విల్టన్ అద్వితీయ స్పీడ్, నైపుణ్యంతో దూసుకెళ్లారు. ఓవరాల్‌గా 121 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. జపాన్‌కు చెందిన హోండా రేసింగ్ కార్పోరేషన్ (హెచ్‌ఆర్‌సీ) 132 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. ఆబీ మడిసన్ రేసింగ్ 131 పాయిం ట్లతో ద్వితీయ స్థానం సాధించింది. మహిళా రేసర్లలో గత సీజన్ చాంపియన్ శాండ్ర గోమేజ్ సత్తా చాటింది. మెరుపు వేగంతో రేసు ముగించి మహిళా రేసర్లలో చాంపియన్‌గా అవతరించింది. అరంగ్రేట రేసులోనే అద్భుత ప్రదర్శనతో మూడో స్థానంలో నిలువటంపై ఇండీ రేసింగ్ జట్టు యజమాని కంకణాల అభిషేక్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఎం ఈ ఎక్స్‌ప్లోరర్ రెండో రేసు మే 3-4న నార్వేలో జరుగనుంది.