సీఎం వర్సెస్‌ మాజీ సీఎం

– త్రిపుర బీజేపీలో ఆధిపత్య పోరు
– విప్లవ్‌ దేవ్‌, మాణిక్‌ సాహాల మధ్య విభేదాలు
– అధికార పార్టీకి తలనొప్పిగా తాజా పరిస్థితులు
అగర్తల : ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అధికార బీజేపీకి కొత్త తల నొప్పి ఎదురైంది. బీజేపీ సీనియర్‌ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, ప్రస్తుత సీఎం మాణిక్‌ సాహాల మధ్య పొసగటం లేదు. వారి మధ్య విభేదాలు బీజేపీలో సంక్షోభాన్ని తీసుకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నా యని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ తన బలాన్ని పెంచుకోవాల ని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ ఇద్ద రి నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు బీజేపీకి తీవ్ర నష్టం కలిగించొచ్చని పరిశీలకు లు భావిస్తున్నారు. 2018లో అప్పటి త్రిపుర ముఖ్యమంత్రిగా ఉన్న విప్లవ్‌కుమార్‌ దేవ్‌.. మాణిక్‌ సాహాను కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి చేర్చుకున్నారు. అనంతరం వీరిద్ద రు సన్నిహిత మిత్రులుగా మెలిగారు. ఆ తర్వాత మాణిక్‌ సాహా.. విప్లవ్‌దేవ్‌కు విధేయుడిగా కొనసాగారు. అనంతరం పార్టీ శ్రేణుల ద్వారా ఎదిగి.. 2022 మేలో విప్లవ్‌ను బీజేపీ అధిష్టానం సీఎం కుర్చీ నుంచి అక స్మాత్తుగా దించి ఆయన స్థానాన్ని మాణిక్‌ సాహాతో భర్తీ చేయించే స్థాయికి వచ్చారు. అప్పటి నుంచి వేగంగా మారిన రాజకీయ పరిణామాలు మాణిక్‌ సాహాకు అనుకూలంగా మారాయి. ఉప ఎన్నికల్లో విజయాల ద్వారా ముఖ్యమంత్రి పదవిని సాహా సుస్థిరం చేసుకున్నారు. 2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో పార్టీ విజయం సాధించటం ద్వారా అనుభవ జ్ఞుడైన రాజకీయ నాయకుడి గా ఎదిగాడని విశ్లేషకులు వివరించారు.
ఇద్దరి మధ్య మాటల యుద్ధం
రాజ్యసభ సభ్యుడిగా, హర్యానా పార్టీ యూనిట్‌ ఇంచార్జీగా విప్లవ్‌ దేవ్‌ త్రిపురకు దూరంగా ఢిల్లీ, హర్యానాలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే ఈనెల 10న త్రిపురలోని గోమతి జిల్లాలో జరిగిన సంస్థాగత సమావేశంలో సీఎం మాణిక్‌ సాహా మాట్లాడుతూ.. ”ప్రభుత్వం వచ్చే ఐదేం డ్లు మాత్రమే కాదు.. చాలా కాలం పాటు అధికారంలో కొన సాగాలి. నేను లేకుండా త్రిపుర నడవదు అనుకోవడం మూర్ఖత్వం. 4-5 ఏండ్ల ముఖ్య మంత్రి ఎలా అదృశ్యమయ్యారో మనం చూశాం” అని ఆయన అన్నారు. అయితే, ఇది విప్లవ్‌ దేవ్‌ను ఉద్దేశించి అన్న మాటలుగా విశ్లేషకులు భావిం చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు స్పందించిన విప్లవ్‌ దేవ్‌.. ” ‘బాహ్య ప్రభా వం’తో ఒక వర్గం ‘బయటి వ్యక్తులు’ త్రిపురలో బీజేపీని బలహీనపరుస్తు న్నారు. పరిస్థితిని పార్టీ హైకమాండ్‌కు తెలియజేశాను” అని అన్నారు. సీఎంకు కౌంటర్‌గానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు తెలిపారు. త్రిపుర బీజేపీలో ఇద్దరు కీలక నాయకుల మధ్య నెలకొన్న మాటల యుద్ధం, ఆధిపత్యపోరు రానున్న రోజుల్లో ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందని అంచనా వేస్తున్నారు.