అంగరంగ వైభవంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం

– తరలి వచ్చిన వందలాది మంది భక్తులు
– ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి జానారెడ్డి
– ఆలయం వద్ద మహాఅన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం చాలకుర్తి గ్రామంలో లో రోడ్డు సుద్దర్వానపల్లె రోడ్డు నందు ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 336 ఆరాధన ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామీ వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ని దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ అర్థం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శ్రీ ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులను విశ్వకర్మ దంపతులకు సరస్వతీ నదీతీరంలో శ్రీ కీలకనామ సంవత్సర కార్తీక శుద్ధ ద్వాదశి క్రీస్తుశకం 1608 వ సంవత్సరంలో జన్మించారని పురాణాలు చెపుతున్నాయి. స్వామి బాహ్య ప్రపంచంలో 85 సంవత్సరాలు గడిపి క్రీస్తుశకం 1693లో ముఖ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారరు.ఆనాడు నుండి ఈనాటి వరకు జగత్ కళ్యాణ కోసం యోగ నిద్ర ముద్రితులై భక్తాదుల నీరాజనాలు అందుకున్నారు.సర్వమత సమ్మేళనం ద్యేయంగా కుల మతాలకు అతీతంగా అందరి మన్ననలను పొందారు.స్వామి వారి కళ్యాణం మహోత్సవానికి. మండలం నుంచి వందల సంఖ్యలో భక్తులు హాజరై కళ్యాణాన్ని కనులరా విక్షించి మొక్కులు తీర్చుకున్నారు.ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,మాజీ జెడ్ పి వైస్ ఛైర్మెన్ కర్నాటీ లింగారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి పాల్గొని కల్యాణాన్ని వీక్షించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపిరమావత్ శంకర నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మల పల్లి చంద్ర శేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు పగడాల నాగరాజు, ఉంగరాలు శ్రీనివాస్,బై కానీ లక్ష్మయ్య, భక్తులు తదితరులు వున్నారు