
జుక్కల్ మండలంలోని గ్రామపంచాయతి కార్యాలాయాలలో విధులు నిర్వహిస్తున్న కార్యదర్శులు, జేపిఎస్ లు మంగళ వారం నాడు జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ ను మండల సంఘం అద్యక్షుడు జాదవ్ మనోహర్ అధ్వర్యంలో క్యాంప్ ఆఫీస్ లో సన్మానించారు. ఈ సంధర్భంగా ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావ్ మాట్లాడుతు గ్రామాల ఆభివృద్దిలో సర్పంచుల పదవి కాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోందని. కార్యదర్శుల పాత్ర కీలకంగా ఉంటుందని, సమయ పాలన పాటీంచాలని, విధులు సక్రమంగా నిర్వహించి ప్రజల సమస్యల ఎప్పడికప్పులు పరిష్కరించాలని ఆభివృద్దిలో మీపాత్ర కన్పించే విధంగా మీవంతుగా కృషి కొన సాగీంచాలని పేర్కోన్నారు. అంతకు ముందు ఎమ్మెలేను పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మండల జీపీ కార్యదర్శుల సంఘం అద్యక్షుడు జాదవ్ మనోహర్, లొంగన్ అనురాద , బంగారుపల్లి సతీష్, చిన్నగుల్లా నాగయ్య, శ్రీనివాస్ ఖండేభల్లూర్, ఆశోక్, చండేగాం వికాస్ రెడ్డి , ,పడంపల్లి భరద్వాజ్, సోపూర్ ఆశోక్ రాథోడ్, తదితరులు పాల్దోన్నారు.