నేటి సమాజంలో మహిళల హక్కులు చట్టాలపై అవగాహన

నవతెలంగాణ –  రెంజల్

నేటి సమాజంలో మహిళ హక్కులు చట్టాలపై అవగాహన కలిగినప్పుడే వారు ధైర్యంగా ముందుకు వస్తారని, ఆడపిల్లలను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం అనే సంకల్పంతో ముందుకు సాగాలని జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని రసూల్ బి పేర్కొన్నారు. మంగళవారం రెంజల్ మండల పరిషత్ కార్యాలయంలో మహిళల హక్కుల పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, వారికి మహిళా చట్టాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. బాలల హక్కులు, బాల్యవివాహాల ను అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంఈఓ గణేష్ రావు, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, ఏపీఎం చిన్నయ్య, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా మహిళా సాధికారత కోఆర్డినేటర్ స్వప్న, సౌమ్య, కవిత, రెంజల్ అంగన్వాడి టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.