ముదిరాజ్ లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించాలి: దేప శ్యాంసుందర్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
నామినేటెడ్ పదవుల్లో ముదిరాజ్ లకు అవకాశాలు కల్పించాలని ముదిరాజ్ మహాసభ యువజన సంఘం జిల్లా నాయకులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముదిరాజ్ లు శక్తివంచన లేకుండా కృషి చేశారని ఆయన అన్నారు.రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న ముదిరాజ్ లు అనాదిగా రాజకీయంగా అనగదొక్క బడ్డారని తెలిపారు.గత పాలకుల నిర్లక్ష్యంతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయారని త్రీవ ఆవేదన వ్యక్తం చేశారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ లను రాజకీయంగా అనగదొక్కిందని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముదిరాజ్ లపై ఎంతో విశ్వాసం ఉందని,ముదిరాజ్ లకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తారని విశ్వసిస్తున్నామని దేప శ్యాంసుందర్ ముదిరాజ్ తెలిపారు