– అవకాశం వచ్చినా ప్రధాని పదవిని వదులుకున్న కాంగ్రెస్ కుటుంబం
– 8 లక్షల కోట్ల అప్పులోకి రాష్ట్రం
– ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కృష్ణారావు
నవతెలంగాణ – అచ్చంపేట
పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల చేయాలని, 16 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని , రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొని మాట్లాడారు. ఇంద్ర గాంధీ కుటుంబానికి చరిత్ర ఉంది. ప్రధానమంత్రి అవకాశాలు వచ్చిన వదులుకున్నారు. కెసిఆర్ కుటుంబం అధికారంలోకి రాగానే కుటుంబ సభ్యులకు పదవులను అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. ధనిక రాష్ట్రాన్ని ఎదమిది లక్షల కోట్లు అప్పుగా మార్చిన ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు అయినప్పటికీ సంక్షేమ పథకాలు అమలుతీరిలో తీవ్రంగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. మీ అందరికీ తెలుసు లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మాణం చేసిన మేడిగడ్డ ప్రాజెక్ట్ పరిస్థితి మీ అందరికీ తెలుసు అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం పరిపాలన విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. త్వరలోనే 500 రూపాయలకి సిలిండర్, నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మంత్రివర్గం నిర్వహించిందన్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు మంజూరు చేసామన్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి, కే ఎల్ ఐ ప్రాజెక్ట్, నక్కల గండి రిజర్వాయర్, ఎస్ ఎల్ బి సి స్వరంగం ప్రాజెక్ట్ లలో అచ్చంపేటకు రావలసిన సాగునీరు త్రాగు వచ్చే విధంగా చూడాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ , వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, స్థానిక నాయకులు నరసయ్య యాదవ్, సీఎం రెడ్డి, అనంతరెడ్డి , జెడ్పిటిసి మంత్రి నాయక్ , గోపాల్ రెడ్డి , రాజేందర్ న్యాయవాది , మాధవరెడ్డి, శత్రు నాయక్ , కపిలవాయి శేఖర్, తదితరులు ఉన్నారు.