
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వావిద్యాలయం పరిశోధన సంచాలకులు, డాక్టర్ పి. రఘురామ రెడ్డి, వ్యవసాయ పరిశోధన స్థానం తోర్నాల ప్రొఫెసర్, హెడ్ డాక్టర్. యస్. శ్రీదేవి, శాస్త్రవేత్త డాక్టర్ ఇ. ఉమారాని పొద్దుతిరుగు డు పంటలను పరిశీలించారు. మంగళవారం మండలం లోని గణపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ వారితో కలిసి పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రోదుతిరుగుడు పంట విస్తీర్ణం తగ్గడానికి గల కారణాలను రైతులను అడి గి తెలుసుకొని, పంట దిగుబడి పెరగడంలో విత్తన ఎంపిక, విత్తే పద్దతి, విత్తే దూరం, ఎరువులు, నీటి యాజమన్యం, తాలు గింజలు ఏర్పడకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తల గురించి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవ సాయ అధికారులు మోహన్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి దేవేందర్, గ్రామానికి చెందిన రైతు సోద రులు పుల్లగూర్ల యెల్ల రెడ్డి, గొట్టం యాదగిరి, పుల్ల గూర్ల నర్సింహా రెడ్డి తదితరులు ఉన్నారు.