
శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు, మత్స్యగిరింద్ర స్వామి కళ్యాణం మంగళవారం వేద పండితుల మంత్రొచోనాల మధ్య చూడ ముచ్చటైన కనుల పండుగగా కళ్యాణం జరిగింది. కొత్తగట్టు గుట్టపై వెలిసిన మత్స్యగిరింద్ర స్వామి కళ్యాణం మండపంలో భూదేవి నీలాదేవిలతో స్వామివారి కళ్యాణం జరిగింది.ఈ కల్యాణానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున అందజేశారు.విణవంక మండలంలోని భేతిగల్ గ్రామానికి చెందిన విడెపు వంశస్థులు సంప్రదాయం ప్రకారం వరుడు తరపున మంగళసూత్రాలు తీసుకురాగా కొత్తగట్టుగుట్టపై ఎదుర్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కనుల పండుగగా జరిగిన స్వామివారి కళ్యాణం చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సరోజన, చైర్మన్ మల్లారెడ్డి, ఈవో సుధాకర్, మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొప గొని బసవయ్య గౌడ్ , ప్రజా ప్రతినిధులు ధర్మకర్తలు భక్తులు పాల్గొన్నారు.