ముఖ్య గమనిక.. రిలీజ్‌కి రెడీ

ముఖ్య గమనిక.. రిలీజ్‌కి రెడీవిరాన్‌ ముత్తంశెట్టి హీరోగా, లావణ్య హీరోయిన్‌గా శివిన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజశేఖర్‌, సాయి కష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్‌.వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ముఖ్య గమనిక’. హీరో విశ్వక్‌ సేన్‌ ముఖ్యఅతిథిగా ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ సినిమాని ఈనెల 23న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ, ‘విరాన్‌ నేను జిమ్‌ ఫ్రెండ్స్‌. విరాన్‌కి ఈ సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని చెప్పారు. ‘కిరణ్‌ అందించిన మ్యూజిక్‌ చాలా బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్‌కి ప్రత్యేక కతజ్ఞతలు. మంచి సినిమాతో మీముందుకు వస్తున్నాను’ అని డైరెక్టర్‌ వేణు మురళీధర్‌ అన్నారు. హీరో విరాన్‌ ముత్తంశెట్టి మాట్లాడుతూ, ‘బ్యాగ్రౌండ్‌, మ్యూజిక్‌, ఎడిటింగ్‌, సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్‌ అవుతుంది అని నమ్ముతున్నాను’ అని తెలిపారు.