బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్, కుషితకల్లపు హీరో, హీరోయిన్స్‌గా లక్ష్మణ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బాబు నెం1 బుల్ షిట్ గరు..’. డీడీ క్రియేషన్స్ బ్యానర్ పై దండు దిలీప్ కుమార్ రెడ్డి నిర్మించారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో బేబీ నిర్మాత ఎస్కేఎన్, దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత వివేక్ కూచిభొట్ల ముఖ్య అతిథులుగా హాజరైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ,’ఈ ప్రాజెక్ట్ నన్ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళుతుందని కోరుకుంటున్నాను. మూడు భాషల్లో ఈ సినిమా చేశాం. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా చేశారు. యూనిక్ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్, డ్రామా ఉన్న కథ ఇది’ అని తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూర్చుని చూడదగ్గ మూవీ ఇది. తప్పకుండా థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూడాలి’ అని హీరోయిన్ కుషితకల్లపు అన్నారు. దర్శకుడు లక్ష్మణ వర్మ మాట్లాడుతూ,’భిన్న కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా కచ్చితంగా అందర్నీ అలరిస్తుందే నమ్మకంతో ఉన్నాం’ అని చెప్పారు. లక్ష్మణ్ వర్మ, సోనాలి పానిగ్రాహి, మురళీధర్ గౌడ్, భద్రం, రవి వర్మ, జబర్దస్త్ అప్పారావు, బద్రి, సునీత మనోహర్, బేబీ ఆరాధ తదితరులు నటిస్తున్నారు.