మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులపై వివక్ష

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ పరీక్షల విధుల కేటాయింపులో మోడల్‌ స్కూల్‌ అధ్యాపకుల పట్ల ఇంటర్‌ బోర్డు అధికారులు వివక్షను చూపుతున్నారని పీఎంటీఏటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు తరాల జగదీశ్‌ తెలిపారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యమని మంగళశారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు (సీఎస్‌), డిపార్ట్‌మెంటల్‌ అధికారులు (డీవో), ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ల వంటి విధులను మోడల్‌ స్కూల్‌ అధ్యాపకులకు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు.