నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు జీపీ కార్మీకురాలీనిలను కౌలాస్ గ్రామనికి చెందిన రాజ కుటింబికురాలు కాంగ్రేస్ నాయకురాలు విండో డైరెక్టర్ అనితాసింగ్ ఎమ్మెలే క్యాంప్ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ తోట కలిసి ఆయన అద్వర్యంలో సఫాయి కార్మీకులకు శాలువాలతో సన్మానించారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనితా సింగ్ మాట్లాడుతు గ్రామాలలో మురికి కాలువలను శుభ్రం చేస్తు తమ ఈ రోగాలను పణంగా పెట్టి ప్రజల బాగుండాలని తమ జీవితాలనే ప్రజల పరిశుభ్రత కొరకు పణంగాపెట్టి నిత్యం శ్రమిస్తు , ఆనారోగ్యం పాలైన అతిగతి లేకుండా సేవలందిస్తున్న మహిళ జీపీ కార్మీకుల విధులను వెల కట్టలేనిదని అన్నారు, గళీజ్ గా ఉన్న మురికి కాలవలను తొలగుస్తు కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు తవ వంతుగా పనులు చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెలే తోటలక్ష్మీకాంతారావ్ , విండో డైరెక్టర్ కాంగ్రేస్ నాయకురాలు అనితాసింగ్, సిఐటీయూ జిల్లా కార్యవర్గ సబ్యుడు సురేష్ గొండ, మండల కాంగ్రేస్ నాయకులు, అన్నీ జీపీల సఫాయి కార్మీకులు తదితరులు పాల్గోన్నారు.