
డిచ్ పల్లి- ఇందాల్ వాయి మండల ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ఎన్నికలు బుధవారం డిచ్ పల్లి మండల కేంద్రంలోని వందేమాతరం పాఠశాలలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షులుగా టీ.ఎం. విక్రాంత్ (వందేమాతరం హై స్కూల్), జనరల్ సెక్రెటరీగా తేలు గంగాధర్ (జ్ఞాన వాగ్దేవి స్కూల్, ఇందల్ వాయి మండల కేంద్రం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన కార్యవర్గాన్ని సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా ఆమేటి సాయిలు (వివేకానంద స్కూల్ ), ముఖ్య సలహాదారుడు జీకే గంగారెడ్డి ( జీనియస్ హై స్కూల్ ) సభ్యులుగా ఎం డి నబి (వాణి హై స్కూల్), కోదండ రామయ్య (విజ్ఞాన్ స్కూల్), ఆమేటి అరవింద్ (శ్రీ వాగ్దేవి స్కూల్) ,కే. గంగారం (సాయి బ్లెస్సింగ్ స్కూల్) ,ఎండి.జుబేర్ (రైన్& సైన్ స్కూల్), లీనా (విశ్వశాంతి స్కూల్ ),వెంకటరమణ (చందమామ స్కూల్), సోమనాథ్ (నేషనల్ స్కూల్) ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి, వినోద్ (భారతి విద్యానికేతన్) (జోసెఫ్ సెయింట్ జోసెఫ్ స్కూల్), ధర్మారం బి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు టీ.ఎం. విక్రాంత్ మాట్లాడుతూ పిల్లల విద్యాభివృద్ధికి మనమందరం బాగా కృషి చేయాలని, ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించే విధంగా అందరితో కలిసి కృషి చేస్తామని విక్రాంత్, తేలు గంగాధర్ లు అన్నారు.