ముదిరాజ్ ఉద్యోగ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రంలో బుధవారం ముదిరాజ్ ఉద్యోగ సంఘం క్యాలెండర్ ను ముదిరాజ్ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షులు బాలకిషన్, మాజీ సర్పంచ్ దండ బోయిన సంజీవ్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజుల, ఐక్యతకు, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ముదిరాజులకు అవగాహన కల్పిస్తూ, వారికి అండగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్, జూనియర్ అసిస్టెంట్ రాజకుమార్, మండల ముదిరాజ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.