
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ధూప దీప నైవేద్య అర్చకులు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ధూప దీప నైవేద్య అర్చకుల సంఘం జిల్లా అధ్యక్షులు అంజనప్ప మాట్లాడుతూ ధూప దీప నైవేద్య అర్చకులకు పాత వేతనం కొత్తవేతనం అందరికీ విడుదల చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మండల్ అధ్యక్షులు వెంకట్ మహారాజ్ కార్యదర్శి గోపాల్ చారి ఈ కార్యక్రమం మండల కేంద్రంలోని విఠలేశ్వర మందిర్లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందుమూలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధూప దీప అర్చకులకు కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని కోరడమైనది.