వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
నవతెలంగాణ-వేములపల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పి కొట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య కార్మికులకు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సలుకునూరు, రావులపెంట గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హమి చట్టాన్ని పరిరక్షించాలన్నరు. గత ఎనిమిది ఏండ్లుగా కేంద్ర బడ్జెట్‌లో నిధులను తగ్గిస్తు పధకాన్ని నీరుగారిస్తున్నారని, దేశ వ్యాప్తంగా 20 కొట్ల మంది దళితులు, 18 కోట్ల మంది గిరిజనులు ఉపాధి హమి పనివల్ల ఆత్మ గౌరవంతో బతకాడాన్ని బీజేపీ జీర్ణించుకొవడం లేదన్నారు. కూలీలు చేసిన పనికి వారం రోజులలో చెల్లించాల్సిన వెతనాలు ఆరు నెలలైన వెతనాలు చెల్లించకుండ శ్రమ దొపిడికి పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. సమ్మర్ అలవెన్స్ చెల్లించడం లెదన్నారు. పట్టణ పేదలకు ఉపాది హమి పని కల్పించాలని డిమాండ్ చేశారు. పని అమలౌతున్న గ్రామాలను కొత్తగా నగర పంచాయితీలు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో కలిపి పట్టణం పేరుతో కూలీలకు పనిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం లేదు. పట్టణ పేదలకు ఉపాధి పని పెట్టాలనే సోయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. చేసిన పనికి చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వకుండా అరకొర ఇస్తున్నారని, కేరళలోని వామపక్ష ప్రభుత్వ మాదిరి పట్టణ పేదలకు ఉపాధి పనులు పెట్టాలని డిమాండ్ చేశారు. జాబ్ కార్డులలో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని చట్టంలో ఉన్న డైరెక్షన్‌ను అమలు చేయాలంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ 2.64 లక్షల కోట్లు కేటాయించాలని ప్రజాసంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పని ప్రదేశంలో ఉదయం 7 గంటలకు సాయంత్రం ఐదు గంటలకు రెండుసార్లు ఫోటోలు దిగి ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేస్తేనే వేతనాలు ఇస్తామని చెప్పడం సరైన కాదన్నారు. మరోక వైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యూబిక్ మీటర్ల కొలతల పేరుతో చేసిన పనికి చట్ట ప్రకారం రూ.272 వేతనాలు చెల్లించకుండా కోత విధిస్తున్నరన్నరు. చట్ట ప్రకారం వారం వారం బ్లూ ఫాం, పేస్లిప్పు ఇవ్వడం లేదన్నారు. అసిస్ట్ణేంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జూన్ 5న చేపట్టే కలెక్టర్ ముట్టడిని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి, సరోజ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అంకెపాక సైదులు, మండల అధ్యక్షులు మారయ్య, ఫీల్డ్ అసిస్టెంట్లు జనార్దన్, సతీష్, సంఘం నాయకులు శీలం లింగయ్య, నక్క పెద్ద వెంకటయ్య, పిట్టల జానయ్య, సీమల పద్మ, పశువుల మంగమ్మ, దొంతి రెడ్డి పుష్ప, వల్లపు దాసు పాపమ్మ, తుపాకుల రాజు, దూదిమట్ల సరిత, గడ్డం సైదులు తదితరులు పాల్గొన్నారు.