ఏ బడికి వెళ్ళినా నా బాల్య మే గుర్తొస్తుంది : ఎమ్మెల్యే జారే

నవతెలంగాణ-అశ్వారావుపేట : ఏ బడికి ఎందుకు వెళ్ళినా నా బాల్య మే గుర్తుకు వస్తుందని,నేను విద్యార్ధి దశలోనే ఎంతో ఉత్సాహంగా,ఉల్లాసంగా ఉంటూ చదువులో ముందు ఉండే వాడినని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన బాల్య స్మ్రుతులను గుర్తు చేసుకున్నారు. బుధవారం స్థానిక ఎం.జె.పి టి.బి.సి.డబ్ల్యు.ఆర్ బాలికల స్కూల్ 7 వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడుతూ తన బాల్య స్మ్రుతులను నెమరు వేసుకున్నారు.స్కూల్ ప్రిన్సిపాల్ కె.స్వప్న అద్యక్షతన జరిగిన ఈ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడు విద్యార్ధిగా ఉన్న ఎవరైనా మొదటి ప్రాధాన్యత చదువు కే ఇవ్వాలని,రెండో ప్రాధాన్యత ఆట పాటలకు ఇవ్వాలని అన్నారు.ఆటలు ఆడే వారిలో క్రీడా స్పూర్తి మెండుగా ఉండి చదువులో రాణిస్తారని అన్నారు.ఎవరి అభిరుచికి తగ్గా ప్రణాళికను వారు బాల్యంలోనే రూపొందించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి శ్రీరామమూర్తి,ఎం.పి.టి.సి మిండ హరిబాబు,పీఏసీఎస్ అశ్వారావుపేట అద్యక్షులు చిన్నం శెట్టి సత్యనారాయణ,   ఆర్.సి.ఓ టి.అంజలి,డి.సి.ఒ బ్యూలా రాణి,ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యు.ఆర్ బాలుర స్కూల్ ప్రిన్సిపాల్ కే.మంజుల,జిల్లా పరిషత్ ఉన్నత బాలురు పాఠశాల హెచ్.ఎం పి.హరిత,కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్,తుమ్మ రాంబాబు లు పాల్గొన్నారు.