– ఎస్‌ఐ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం కారు చెట్టును ఢీకొీట్టడంతో ఎస్‌ఐ సహా ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ప్యాపిలి ఎస్‌ఐ వెంకటరమణ(57) కుమార్తె అనూష వివాహం హైదరాబాద్‌కు చెందిన పవన్‌సాయి(25)తో ఫిబ్రవరి 15న అనంతపురంలో జరిగింది. హైదరాబాద్‌లోని పవన్ ఇంటి నుంచి బుధవారం సాయంత్రం అనంతపురం వెళ్తుండగా కారు అదుపు తప్పి అన్నాసాగర్ గ్రామ పరిధిలో రోడ్డు పక్కన చెట్టును ఢకొీట్టింది. దీంతో వెంకటరమణ, పవన్‌సాయి, డ్రైవర్ చంద్ర(23) అక్కడికక్కడే మృతిచెందారు. వెంకటరమణ కుమార్తె అనూషకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాలను మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. పెండ్లైన వారం రోజులకే మామాఅల్లుళ్లు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.