
– జంతు సంరక్షణలో అటవీ అధికారుల వైఫల్యమే కారణమా..?
నవతెలంగాణ – నాగార్జునసాగర్
కుక్కల దాడిలో ఏకో ఫారెస్టులోని జింకలు వరుసగా మృతి చెందుతున్న సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. గత 8వ తేదీన కుక్కల దాడిలో జింక మృతి చెందగా తాజాగా తిరుమలయ గట్టు సమీపంలోని కుంకుడు చెట్టు తండ వద్ద కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వరాల్లోకి వెళితే..నాగార్జునసాగర్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో తిరుమలయ గట్టు సమీపంలో ఉన్న కుంకుడు చెట్టు తండా వద్ద గురువారం తేల్లవారుజామున తిరుమలయ గట్టు సమీపంలో రహదారి వెంబడి ఉన్న వ్యవసాయ క్షేత్రంలో రాగా విధి కుక్కలు వెంటపడి జింకను హత మార్చిన వైనం.. స్థానిక ప్రజలు గమనించి కుక్కలను తరిమికొట్టారు అప్పటికే జింక మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు జింకను పరిశీలించి మృతి చెందినట్లు దృవీకరించారు.అనంతరం పశువైద్యాధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి.. ఉన్నతాధికారుల ఖననం చేయాలని అదేశించటంతో కింది స్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేశారు.జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నా.. వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని జంతు, ప్రకృతి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.