ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలి: టీఎస్ యూటీఎఫ్

నవతెలంగాణ – గుండాల
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలని, 317 జీఓ ద్వారా నష్టపోయిన వారికి న్యాయం చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.కిశోర్ సింగ్, ఎన్.కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గుండాల మండల కేంద్రంలో టీఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షుడు పి.బాలస్వామి అధ్యక్షతన జరిగిన ఆ సంఘం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ.. పెండింగ్ లో ఉన్న మూడు డీ.ఏలను వెంటనే ప్రకటించాలని కోరారు. గుండాలలో  ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల ప్రమోషన్ లు, బదిలీలు చేపట్టాలని తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల వింగ్ కె.సురేష్, యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్.రూప్ సింగ్, ఉపాధ్యక్షులు ఏ.వీరన్న, ఎన్.కృష్ణకుమారి, కార్యదర్శులు బి.బాలోజీ, ఎన్.సురేష్, తదితరులు పాల్గొన్నారు