హైదరాబాద్ : ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్ సంస్థ హార్డ్‌విన్ ఇండియా 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32 శాతం వృద్థితో రూ.4.31 కోట్ల నికర లాభాలు సాధించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ 24.94 శాతం పెరిగి రూ.39.9 కోట్లుగా చోటు చేసుకుందని ఆ సంస్థ తెలిపింది. వ్యయాలు 8.92 శాతం పెరిగి రూ.0.98 కోట్లుగా నమోదయ్యింది. గురువారం ఎన్‌ఎస్‌ఇలో హార్డ్‌విన్ ఇండియా షేర్ 1.25 శాతం పెరిగి రూ.45.10 వద్ద ముగిసింది.