రైతులు ఆందోళన చెందొద్దు

Farmers don't worry– విద్యుత్‌ సరఫరా చేస్తాం : బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవ తెలంగాణ-సిద్దిపేట
సిద్దిపేట పట్టణంలో పేలిపోయిన 220 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ వల్ల రైతులు, గృహావసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తామని, ఆందోళన చెందొద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని విద్యుత్‌ కేంద్రంలో 220 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ పేలిపోయిన ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, విద్యుత్‌ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి పరిశీలించి, ప్రమా దానికి గల కారణాలను అడిగి తెలు సుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గృహ, వాణిజ్య, వ్యవ సాయ అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే హైదరాబాద్‌ నుంచి ట్రాన్స్‌కో డైరెక్టర్‌ జగత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ, అగ్ని మాపక శాఖ అధికారులు వచ్చి పక్క నున్న ట్రాన్స్‌ఫార్మర్‌కు మంటలు వ్యాపిం చకుండా చర్యలు తీసుకున్నార న్నారు. సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి గృహ అవసరాలకు విద్యుత్‌ పునరుద్ధరించి నట్టు తెలిపారు. గురు వారం ఉదయం 5 గంటలకు వ్యవ సాయానికి కూడా విద్యుత్‌ సరఫరా చేసినట్టు చెప్పారు.
పేలిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ చాలా పాతదని, అది ఇప్పటికే దాని కెపాసిటీకి మించి పనిచేసిందని తెలిపారు. విద్యుత్‌ ప్రమాదానికి గల కారణాలపై విచార ణకు అధికారులను అదేశించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయ కులు దారిపల్లి చంద్రం, అత్తు, సూర్య వర్మ, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ మహేష్‌, పాల్గొన్నారు.