నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని నాగల్ గావ్ గ్రామ పంచాయతి కార్యాలయాన్ని మండల పరిషతి అధికారీ శ్రీనివాస్ శుక్రవారం నాడు సందర్శించారు. ఈ సంధర్భంగా పలు రికార్డులను పరీశీలించి రికార్డులను ఎప్పడికప్పుడు పూర్తీ చేయాలని జీపీ కార్యదర్శి హరిష్ కు ఆదేశించారు. జీపీలలో పెరుకు పోయిన సమస్యలను వెంటనే పరీశీలించి సరి చేయాలని, వందశాతం పన్నులు వసూళ్లు చేయాలని, గ్రామాలలో పరిశుభ్రతతో పాటు ఎండకాలంలో నీటీ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా సమస్య ఉన్న చోట గుర్తించి బాగు చేయాలని, విధులలో నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ కపిల్ పటేల్ ఎంపిడీవో ను కలిసి మెుదటి సారిగా ప్రత్యేక అధికారి హోదాలో వచ్చినందుకు కార్యదర్శి హరీష్ తో కలిసి శాలువా గాంధీటోపీ పెట్టి ఎంపిడివో శ్రీనివాస్ ను సన్మానించారు.