సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్న గాంధారివాసి

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన చాకలి పోచయ్య సౌదీ అరేబియాలో రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న చాకలి పోచయ్య మృతదేహాన్ని తెప్పించాలని ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడుని మృతుని కుటుంబ సభ్యులు కలిసి అభ్యర్థించారు వినతి పత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన కోటపాటి సౌదీలోని ఇండియన్ ఎంబసీ, ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. త్వరలోనే యజమాని పూర్తి ఖర్చులతో మృతదేహాన్ని ఇంటికి పంపే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారని కుటుంబ సభ్యులు తెలిపారు.