డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 18 మంది అభ్యర్థుల ఎంపిక

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు 18 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఆ జాబితాను విడుదల చేశారు. 18 డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ ఎనిమిదో తేదీన టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 16న జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితా (జీఆర్‌ఎల్‌)ను, 17న ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్‌ జాబితాను ప్రకటించారు. ఈనెల 20న హైదరా బాద్‌లోని నాంపల్లిలో ఉన్న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. ఇప్పుడు ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను విడుదల చేశారు. వారి వివరాలు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని తెలిపారు. మల్టీజోన్‌-1 పరిధిలో ఐదుగురు, మల్టీజోన్‌-2 పరిధిలో 13 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని వివరించారు