నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్ వద్ద గల ఆల్ ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో శుక్రవారం రాత్రి 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు వేడుకలు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే అన్ని విషయాల పట్ల పట్టు సాధించాలని, తద్వారా సమాజంలో ఉత్తమమైన స్థానాన్ని కైవసం చేసుకోవడమే కాకుండా ఉపాధి అవకాశాలను చాలా సులభంగా సద్వినియోగం చేసుకోగలుగుతారని అన్నారు .విద్యార్థులు ఏకాగ్రతతో ప్రణాళిక బద్ధంగా ఉపాధ్యాయులు బోధించిన విషయాలను సమగ్రంగా సాధన చేసి విజయానికి చేరువ కావాలని మార్గదర్శకులుగా కొనసాగించాలని సూచించారు.. తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సాహం అందించడంతో పాటు పారితోషికాలను కల్పించడం జరుగుతుందని అన్నారు.. అహర్నిశలు కృషి చేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు జ్ఞాపికలను అందజేసినారు ..ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.