
ఢిల్లీలో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న రైతులపై కాల్పులు జరిపి ఒక రైతు మరణానికి కారణమైన బీజేపీ ప్రభుత్వంపై సీపీఐఎంఎల్ నాయకుడు రాజేశ్వర్ మండిపడ్డారు. శనివారం పట్టణ కేంద్రంలోని సుమంగళ చౌరస్తా వద్ద మోడీ దిష్టిబొమ్మను పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాయశ్వర్ మాట్లాడుతూ.. రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు శాంతియుతంగా అడిగిన పాపానికి బీజేపీ ప్రభుత్వం తమ పోలీసులతో కాల్పులు జరిపించి ఒక యువరైతు ప్రాణాలను బలిగొని, ,మిగతా రైతులను గాయాల పాలు చేసి, తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఒకపక్క రైతు ప్రభుత్వమని ,రైతు రాజ్యమే మా ధ్యేయమని ప్రగల్బాలు పలుకుతూ ,మరోపక్క అదే రైతులపై కర్కశంగా వ్యవహరిస్తూ లాఠీలు, తూటాలతో రైతులను కాల్చి చంపి, గాయపరచడం దుర్మార్గపు చర్య అని అన్నారు. యువరైతు ను కాల్చి చంపి, మిగతా రైతులపై రబ్బర్ బుల్లెట్లు, లాఠీ చార్జీ చేసి గాయపరిచిన పోలీసులపై హత్యాయత్నం, హత్య తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని.అలాగే రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని. కాల్పుల్లో చనిపోయిన యువరైతు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని,రైతు కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని. గాయపడిన రైతులకు ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం.ఎల్) ఆర్మూర్ డివిజన్ నాయకురాలు వి.సత్యక్క, సీపీఐ (ఎం.ఎల్) భీంగల్ మండల కార్యదర్శి కే.రాజేశ్వర్.సీపీఐ (ఎం.ఎల్) భీంగల్ మండల నాయకులు జి.అరవింద్, సాయిరెడ్డి, అంబికా.గంగాధర్, మోహన్, అల్తాఫ్, పోషన్న, తదితరులు ఉన్నారు.