ప్రజలకు క్షమాపణ చెప్పి కేటీఆర్ అచ్చంపేటకు రావాలి: ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ

– ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించినా బాలరాజుకు సిగ్గు రాలేదు
నవతెలంగాణ – అచ్చంపేట 
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముందుగా అచ్చంపేట ప్రజలకు క్షమాపణ చెప్పి అచ్చంపేటకు రావాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు పట్టణంలో 2021 లో 17 కోట్ల అభివృద్ధి పనులకు శిలాఫలకాలు వేశారు. నేటికీ ఆ పనులు పూర్తి చేయలేకపోయారు. మోసపూరిత అభివృద్ధిని చూపించి ప్రజలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చరిత్రలో లేని విధంగా 50 వేల మెజార్టీతో చిత్తుచిత్తుగా ఓడించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సిగ్గు రాలేదని వంశీకృష్ణ అన్నారు. కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించడం లేదు ప్రజలకు చెప్పవలసిన బాధ్యత కేటీఆర్ పైన ఉందన్నారు. గువ్వల బాలరాజు తాను అక్రమ ఇసుక దందా చేసునాన్ని అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పది ఏళ్లు అధికారం తో విర్రవీగి నీవు అక్రమ ఇసుక దందా చేశావని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. అంబేద్కర్ చౌరస్తాలో తేల్చుకుందాం రా అంటూ సవాలు విసిరారు. భూములు కబ్జాలు గుప్తనిధుల తవ్వకాలు ఇది బాల రాజకీయ సాధ్యమైంది అన్నారు. నీ విధానం నీ పాలన విధానం నచ్చకనే ప్రజలను బహిర్గతంగా తరిమేశారని అన్నారు. నల్లమలలో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసి మన ఊరు మన ఇసుక ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామపంచాయతీలకు 100 కోట్ల సిసి రోడ్లు అభివృద్ధి పనులు మంజూరు అయ్యాయి. ఇలాంటి పనులు ఇసుకతో నిర్మాణం చేస్తేనే నాణ్యతగా ఉంటాయని ఉద్దేశంతో పకడ్బందీగా, ప్రణాళిక పద్ధతిగా అనుమతులతో ఇసుక రవణ జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పిటిసి మంత్రియా నాయక్, మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, రాజేందర్ న్యాయవాది, గిరి వర్ధన్ గౌడ్, కౌన్సిలర్ గౌరీ శంకర్ తదితరులు ఉన్నారు.