ఢిల్లీ పోరు

మోడీ సర్కారుకు ఇప్పుడు ఢిల్లీ సరిహద్దుల్లో రాజుకున్న రైతాంగం పోరాటం దిమ్మె తిరిగేలా చేస్తున్నది. కండ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడింది. నయానో, భయానో భయపెట్టి ఉద్యమమంపై నీళ్లు చల్లుదామనుకున్నా అది సాధ్యమయ్యేలా లేదు. రైతు వ్యతిరేక చట్టాల రద్దు, పంటలకు మద్ధతు ధరలను డిమాండ్‌ చేస్తూ రెండోపాలీ చేపట్టిన ఆందోళనకు జనం, రైతుల నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతున్న ముచ్చట మీకెరునాయే.గప్పుడే శుభ్‌కరణ్‌సింగ్‌ అనే రైతును బీజేపీ సర్కారు పొట్టన పెట్టుకున్నది. ఇప్పటికే దేశంలో మతోన్మాద విషాన్ని వెదజల్లుతున్న కాషాయ మూకకు రెండు నెలల్లోగా పార్లమెంటు ఎన్నికల ముందు ఢిల్లీలో పోరాటం ఆరంభం కావడం వెన్నులో చలిపుట్టిస్తున్నది. మీడియా సపోర్ట్‌ లెకపోయినా వేలాది ట్రాక్టర్లు దేశ రాజధానివైపుగా దూసుకుపోవడం, ఆందోళనకు జైకొట్టడం మోడీ మెడలు వంచే పరిస్థితికి తార్కాణం. తగ్గేదేలా అంటూ దేశరాజధానిని చుట్టుముట్టి ‘మో షా’ల గుండెల్లో నిద్దురపోతున్న వేళ, రైతులకు లాల్‌ సలాములు.
– బి.బసవపున్నయ్య