నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కామారెడ్డి పోస్టాఫీసులోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సేవల్ని తాత్కాలి కంగా నిలిపివేస్తున్నట్టు హైదరాబాద్‌లోని పాస్‌పోర్ట్ ప్రాంతీయ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శనివారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. పై కేంద్రంలో సేవల నిర్వహణ సమస్యల వల్ల తాత్కాలికం గా ఈ నిర్ణయం తీసుకున్నామనీ, దరఖాస్తుదారులు మార్పును గమనిం చాలని కోరారు. ఫిబ్రవరి 26 నుంచి దరఖాస్తుదారుల ఫోన్లకు సంక్షిప్త సందేశాల రూపంలో (ఎస్‌ఎమ్‌ఎస్) వారి అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్ చేస్తూ సమాచారం పంపుతామని వివరించారు. అదనపు సమాచారం, అపాయింట్‌మెంట్స్ కోసం దరఖాస్తుదారులు నిజామాబాద్ లోని పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలు తీజూశీ. ష్ట్రyసవతీabaసఏఎవa.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.