ధన్యవాదాలు…

– మేడారం జాతర ముగింపు సందర్భంగా మంత్రి కొండా సురేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్‌ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన ప్రతి ఉద్యోగీ, సిబ్బందికి మంత్రి కొండా సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణలో అన్ని శాఖలు పరస్పర సహకారంతో, సమన్వయంతో వ్యవహరించి గొప్పగా విధులు నిర్వహించాయని కొనియాడారు. యాత్రీకులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పెద్ద మనసుతో క్షమించాలని విజ్ఞప్తి చేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మొదటిసారి మేడారం జాతర నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను పూర్తి నిష్టతో చేపట్టినట్టు ఆమె తెలిపారు.