రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా చిన్నారెడ్డి

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా చిన్నారెడ్డినవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈమేరకు శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది. చివరి నిమిషంలో మేఘారెడ్డిని అధిష్టానం ఖారారు చేసింది. అయినప్పటికీ చిన్నారెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. దీంతో ఆయనకు కీలకమైన పదవిని రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి.