యస్.సీ. స్టడీ సర్కిల్ లో గ్రూప్ వన్ కోసం శిక్షణ

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాలలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్టడీ సర్కిల్స్‌లో గ్రూప్-వన్  ప్రభుత్వంచే భర్తీ చేయబడే ఇతర ఉద్యోగాల పోటీపరీక్షల శిక్షణ కొరకు నోటిఫికేషన్ ఫిబ్రవరి 23వ తేదీన రాష్ర్ట షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ రాష్ట్ర డైరెక్టర్ సి శ్రీధర్   నోటిఫికేషన్ జారీ చేశారని, నల్గొండ,  యాదాద్రి- భువనగిరి కి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అని నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్  ఒక ప్రకటనలో తెలియజేశారు. ఒక్కొక్క స్టడీ సర్కిల్ నందు 100 మందికి రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వబడుతుందని,   ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్లు ఉంటాయని,  మొత్తంగా 33% సీట్లు మహిళలకు, 5 శాతం సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేయబడ్డాయని, భోజనం, వసతి, ఉత్తమ ఫ్యాకల్టీతో శిక్షణ, స్టడీ మెటీరియల్స్, డిజిటల్ క్లాసులు, రెఫరెన్సుకై వందలాది పుస్తకాలు, నిరంతర మూల్యాంకనకై వారాంతపు పరీక్షలు మొదలగునవి కలిగిన ఈ శిక్షణ ఐదు నెలలపాటు కొనసాగుతుందనారు. ఈ స్టడీ సర్కిల్లలో ప్రవేశానికై ఎంపిక, పోటీ పరీక్ష ద్వారా  నిర్వహించబడుతుంది. అట్టి పరీక్షకై నేటి నుంచి అనగా ఫిబ్రవరి 23, 2024 నుండి, స్టడీ సర్కిల్  వెబ్సైట్ http://tsstudycircle.co.in/ నందు దరఖాస్తు మార్చి 6 లోపు   దరఖాస్తు చేసుకోవాలని, ఏడవ తేదీన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని, మార్చి 10వ తేదీన  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు స్టడీ సర్కిల్లో పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. ఉత్తీర్ణత సాధించిన వారిని మెరిట్ ఆధారంగా మార్చి 18 నుంచి శిక్షణ ప్రారంభమై ఆగస్టు 17వ తేదీన ముగుస్తుందని తెలిపారు.  ఎంపికైన వారి వివరాలు స్టడీ సర్కిల్ లోనూ, ఆయా జిల్లాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలోనూ, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయంలోనూ నోటీసు బోర్డుపై ఉంచబడతాయని, యస్.సి., యస్.టి., బి.సి (మైనారిటీలతో సహా) కులాలకు చెందిన, నలభై నాలుగేళ్ళలోపు వయసు కలిగిన, డిగ్రీ పరీక్ష‌ ఉత్తీర్ణులైన, సంవత్సరానికి మూడులక్షల లోపు కుటుంబ ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈ ప్రవేశపరీక్షకై దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కులం సర్టిఫికెట్,  ఒక సంవత్సరం నిండనటువంటి ఆదాయం సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్,  వయసును తెలిపే పదో తరగతి సర్టిఫికెట్, ఆధార్ కార్డు,  పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, అంగవైకల్యం సర్టిఫికెట్ (వర్తించేవారికి మాత్రమే) లను సిద్ధం చేసుకుని స్టడీ సర్కిల్ jnవెబ్సైట్ http://.tsscstudycircle.co.in/ నందు అప్లై చేసుకోవాల్సిందిగా నల్గొండ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. పూర్తి వివరాల కొరకు 8465035932, 9603167257,9010895239ఫోన్ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.