
నిజామాబాదు నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం హంపి పీఠాదిపతి జగద్గురు విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాణప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మహాగణపతి పూజ,పుణ్యహవచనం, అఖండ దీపారాధన వాస్తు హోమం,మండప రచనలు, వాస్తుపూజ,యాగశాల ప్రవేశం, గణపతి హోమం,అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు.శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్ పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో ప్రతిష్టాపన పూజలు జరిపారు. నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందారు.ఈ మహోత్సవాల్లో భాగంగా మార్కండేయ మందిరాన్ని పూలు,అరటి తోరణాలు,లైటింగుతో అందంగా అలంకరించారు.వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి హంపి పీఠాదిపతి జగద్గురు విద్యారణ్య భారతి స్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి ఆచరణీయమని పేర్కొన్నారు. అమెరికా పూర్వాద్యక్షులు బరాక్ ఒబామా శ్వేతసౌధంలో దీపావళి పండగను జరిపించడమే ఇందుకు తార్కాణమని ఆయన గుర్తు చేశారు. హిందువులు జరుపుకునే ప్రతి పండగలో ఒక సందేశం ఉందని దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.మమ్మీ డాడి సంస్కృతి మనకొద్దని అమ్మా నాన్న సంస్కృతి ముద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఎస్ఈ రాపెల్లి రవీందర్,నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య , జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా అద్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర సంఘం బాధ్యులు గంట్యాల వెంకట్ నర్సయ్య,దాసరి గుండయ్య,కైరంకొండ విఠల్,బింగి మోహన్,మందిర కమిటీ చైర్మెన్ దేవిదాస్,కార్పోరేటర్ సిరిగాద దర్మపురి,రాపెల్లి గురుచరణ్, బొట్టు వెంకటేష్,కిషోర్,సిలివేరి శంకర్,చింతల గంగాదాస్,బూస శ్రీనివాస్,యేముల సూర్యప్రకాష్,జి.సత్యపాల్,జగన్, తుమ్మ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.