లాస్యనందిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

నవతెలంగాణ – డిచ్ పల్లి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం చాలా బాధ కలిగించిందని, ఆదివారం వారి నివాసానికి బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు తో కలిసి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెళ్లి పరామర్శించారు. గత ఏడాది  లాస్య నందిత తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇప్పుడు ఈమె ఓక రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని,గత ఎన్నికల్లో లాస్య నందితను కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించారని,కంటోన్మెంట్ బీఆర్ఎస్ కార్యకర్తలకు,వారి కుటుంబానికి అన్ని విధాలా  అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.