– వచ్చీ రాని వైద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం!
– ఆర్‌ఎంపీల అవతారం ఎత్తిన నకిలీలు !
– నామమాత్రంగా తనిఖీలు చేస్తున్న అధికారులు
– పుట్టగొడుగుల పుట్టుకొస్తున్న ఆర్‌ఎంపీ దవఖానలు
– పల్లెదవ ఖానాలను అందుబాటులోకి తేవాలి
నవతెలంగాణ-ధారూర్
గ్రామాలలో నకిలీ ఆర్‌ఎంపీలు రోజురోజుకు పుట్టుకొస్తున్నారు. తెలిసి తెలియని వైద్యం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు మూడు సంవత్సరాలు డాక్టర్ల వద్ద పనిచేసిన తర్వాత ఆర్‌ఎంపి బోర్డులు పెట్టుకొని వైద్యం చేయడం ప్రారంభించారు. పేదల మీద పడి దోచుకుంటున్నారు.ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో కూడా తెలియని ఆర్‌ఎంపీలు ఉన్నారు.పేషంట్లపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్న జిల్లా అధికారులు కన్నెత్తి చూడకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తోంది. తూతూ మంత్రంగా పై అధికారులకు తనిఖీ చేసామని చెప్పుకోవడానికి ఏదో ఒక గ్రామానికి వెళ్లడం తనిఖీ చేశామని పై అధికారు లకు వాట్సాప్‌లో ఫోటోలు పంపించి వా అనిపిం చుకోవడానికి సరిపోయారని పెద్ద ఎత్తున విమర్శ లు వెలువెత్తుతున్నాయి.
– ఆర్‌ఎంపీలు చేస్తున్నది ఏంటి…?
నకిలీ ఆర్‌ఎంపీలు ఎంబీబీఎస్ డాక్టర్లు చేస్తున్న ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు. పేషెంట్లకు రక్త పరీక్షలు చేయించడం ఎక్స్రేలు తీయించడం రిపోర్టులు వచ్చాక ఇక్కడ నయం కాదు పెద్ద ఆస్పత్రికి పోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్న హాస్పిటల్ కు పంపించడం అక్కడ కమిషన్ల కోసం కొన్ని పరీక్షలు చేయించడం వీరికి రివాజుగా మారింది ప్రస్తుతం కొందరు ఆర్‌ఎంపీలు సొంతంగా వారే మందుల షాపులు ఏర్పాటు చేసుకొని వాళ్లకు తెలవకుండా గూగుల్లో సెర్చ్ చేస్తూ మందులను పేషెంట్లకు అందిస్తున్నారు. కేవలం పల్లెలకు మాత్రమే కాదు మండల కేంద్రా ల్లోనూ శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ఉన్నారు. కేవ లం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలన్న నిబంధన లను తుంగలో తొక్కుతున్నారు. ఇంత జరుగుతున్న ఏ అధికారి పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తుంది.
– నామమాత్రంగా తనిఖీలు.?
మండల కేంద్రంతో పాటు పల్లెల్లో శంకర్ దాదా ఎంబీబీఎస్‌ల చేతిలో ఏదో ఒక విధంగా మోసపోతు బలైపోతున్నారు.అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఆర్‌ఎంపీలకు ముందుగానే సమాచారం ఉండడంతో తనిఖీలు చేసే సమయం లో రెండు మూడు రోజులు దవఖానాలు మూసేసి తర్వాత యథావిధిగా నడిపిస్తున్నారు. సరైన అను మతులు ఉన్నవా…? నిజమైన వ్యక్తులే వైద్యం చేస్తున్నారా…? అని స్థానిక ప్రజలకు తోలుస్తున్న ప్రశ్న…? ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు తనిఖీ లు పకడ్బందీగా నిర్వహించి శంకర్ దాదా ఎంబీబీఎస్‌ల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.