
రామగిరి మండల కేంద్రంలోని సెంటినరీ కాలనీ నాగేపల్లి రామయ్య పల్లి ముత్యాల తదితర గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ఐటి అండ్ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సహోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిల శ్రీనుబాబు జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేకులు కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, ఘనంగాజరిపారు. ఈకార్యక్రమంలో సెంటినరీ కాలనీలో కాటం సత్యం, కోట రవీందర్ రెడ్డి, ఉయ్యాల కుమారస్వామి, గంట వెంకటరమణారెడ్డి, అదేవిధంగా నాగేపల్లిలో మాజీ జడ్ పిటిసి సభ్యులు ఎల్లే శశిరేఖ రామూర్తి,మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య ,మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, మండల బిసి సెల్ అధ్యక్షులు బండారు సదానందం, వార్డ్ సభ్యులు తీగల సదన్, అదేవిధంగా రామయ్యపల్లిలో గ్రామ సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, ఉప సర్పంచ్ నరేష్ యాదవ్, అలాగే ముస్త్యాలలో గ్రామ సర్పంచ్ రామగిరి లావణ్య నాగరాజు, బర్ల శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, బివి స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.