ఇందిరమ్మ రాజ్యం పేదలకు చూపిస్తాం: ఎమ్మెల్యే వంశీకృష్ణ

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకొస్తామని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.  సోమవారం పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి సాక్షాత్తు డిసెంబర్ 9న ప్రమాణస్వీకారం చేస్తున్నామని ప్రకటించారు. ఈ విషయాన్ని కేటీఆర్ మర్చిపోయారని గుర్తు చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో 70 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు నేను సవాల్ విసురుతున్నా.. ఐదు వేల ఎకరాలకు మించి సాగు అందితే… రాజకీయాలనుంచి తప్పకుండా అని సవాలు విసిరారు. కారు సర్వీసింగ్ కు పోయిందని అంటున్నారు. కానీ పోయింది సర్వీసింగ్ కాదు పాత ఇనుప సామానుకు పోయిందన్నారు. మీ అయ్యా అసెంబ్లీకి ఎందుకు వస్తున్నాడో మొదట తెలంగాణ ప్రజలకు చెప్పవలసిన బాధ్యత నీపైన ఉందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నరసయ్య యాదవ్,   రాజేందర్ న్యాయవాది, డాక్టర్ మోపతయ్య, నాయకులు మహబూబ్ అలీ తదితరులు ఉన్నారు.