
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని రాంరెడ్డి కుంట ను పిల్లాయిపల్లి కాల్వ ద్వారా నింపి భూగర్భ జలాలు పెంచాలని చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని పంతంగి ఎంపీటీసీ బోయ ఇందిరసంజీవ సోమవారం వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలోని భూగర్భ జలాలు మొత్తం ఎండిపోయి కరువు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సీజన్లో వేసిన 10 శాతం వరి నాట్లు కూడా ఎండిపోయి ఉన్నాయని త్రివ ఆవేదన వ్యక్తం చేశారు.పంతంగి గ్రామం పైనుంచి పిల్లాయిపల్లి కాలువ వెళుతుంద ని కాలువ నుండి పక్కనే ఉన్న రాంరెడ్డి కుంటను నింపితే 500 ఎకరాలు సాగులోకి వస్తాయని, భూగర్భ జలాలు పెరుగుతుందని తెలిపారు. శాశ్వత పరిష్కారంగా కాలేశ్వరం కాలువ ద్వారా నీళ్లు నింపి పంతంగి గ్రామం కింద ఉన్న పూర్తిగా వరి పొలాలకు సాగునీరు అందించే అవకాశం కల్పించాలని ఎంపీటీసీ బోయ ఇందిర సంజీవ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డిని కోరారు. ఎంపీపీ మాట్లాడుతూ.. తక్షణమే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీని ఇచ్చారు.ఎంపీటీసీతో గ్రామ పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్ పాల్గొన్నారు.