నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు.ఈ సందర్భంగా మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంధ్రయ్య మాట్లాడుతూ పదవ తరగతికి చెందిన 13 మంది బాలికలు 15 మంది బాలురు ఉపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తమ తోటి విద్యార్థులకు చక్కగా తరగతులు బోధించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయ వృత్తి యొక్క గొప్పతనం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయుల కృషి ఏవిధంగా ఉంటుందో విద్యార్థులు ఉపాధ్యాయులుగా అనుభూతి పొందారన్నారు.ఈ విషయాన్ని ఉపాధ్యాయులగా వ్యవహరించిన విద్యార్థులు స్వయంగా వెల్లడించినట్లు ఆయన తెలిపారు. అనంతరం విషయ బోధనలో ప్రతిభ కనబరిచిన చత్రోపాధ్యాయులకు మండల విద్యాధికారి ఆంధ్రయ్య చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.