పోగోట్టుకున్న ఫోన్ వెతికి అందించిన జుక్కల్ ఎస్సై

నవతెలంగాణ – జుక్కల్

పోగోట్టుకున్న మేాబైల్ ఫోన్ ను జుక్కల్ ఎస్సై సత్యనారాయణ వెతికి బాదితునికి సోమవారం అందించడం జరిగింది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జుక్కల్ మండలానికి చెందిన లాలావార్ గంగాధర్ పెద్గఎడ్గి గ్రామములోని తన వ్వవసాయ క్షేత్రంలో మేాబైల్ అండ్రైడ్ ఫోన్ పోగోట్టు కోవడం పిబ్రవరి 14వ 2024వ తేదిన పోగోట్టుకోన్నాడు. వెంటనే జుక్కల్ పీఎస్ లో ఫిర్యాదు చేసారు. పోలీసులు సిఈఐఆర్ అనే యాప్ ద్వారా పోయిన ఫోన్ ట్రాక్ చేయడం జరిగింది. ఫోన్ ను వెతికి పెట్టి సోమవారం బాదీతునికి అందించారు.  భాదితుడు జుక్కల్ పోలీసులకు కృతఙ్ఞతలు తెలిపారు.