– పట్టించుకోని అధికారులు,ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
మండలకేంద్రానికి ప్రవేశించే ప్రదాన మార్గంలో స్వాగతం పలుకుతున్నట్టుగా వైకుంఠదామం (అంతిమయాత్ర)వాహనాలు దర్శనమిస్తున్నాయని పలువురు గ్రామస్తులు,ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్-నారాయపురం ప్రధానరహ దారిలో ఊరు చివరన ప్రాచీన శివాలయం, కంఠమహేశ్వర ఆలయాలకు మధ్యన రోడు పక్కన చింతచెట్టు కింద ఈ వాహనాలు ప్రతిరోజు ఉంటున్నట్టు ప్రజలు వాపోతున్నారు. ఈ రోడ్డు మీదగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు, వివిధ గ్రామాల నుండి నారాయణపురం వచ్చే బంధువులు అబ్బా! ఇదేందిరా బాబు చావుకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ వాహనాలు అంటూ.. వీటిని నిలిపేందుకు మరెక్కడా స్తలం లేదన్నట్టు.. అని మనస్సులో తిట్టుకుంటూ వెళ్తున్నారని సమీప ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఏమాత్రం ఇబ్బంది అనిపిస్త లేకుండ వచ్చాఅని ఎవరికి వారే ప్రశ్నించుకుంటున్నారు.
శ్మశానవాటికల వద్ద నిలపాలి
బీఅర్‌ఎస్ మండల నాయకులు- చిలువేరు అంజయ్య
గ్రామప్రవేశం రోడ్డు వద్ద ఈ వాహనాలు నిలుపడం వలన చూడడానికి ఇబ్బందికరంగానే ఉంది. ఈ రోడ్డు మీదుగా వెళ్ళే వాళ్ళు చాలా మంది గ్రామస్తులను తిట్టుకుంటూ వెళ్తున్నారు. శ్మశానవాటికలవద్దో.. చెర్వులోని చెట్లకిందనో పెట్టుకుంటే బాగుంటుంది. వాహనదారులకు అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పాలి. వాహనదారులు సైతం అర్థం చేసుకోవాలి.