చౌటుప్పల్ మండల సర్వసభ్య సమావేశం

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే మూడు నెలలు ఎండాకాలం కాబట్టి గ్రామాలలో నీటి కొరత,కరెంటు సమస్యలు లేకుండా చూడాలని కార్యదర్శులకు స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడైనా గ్రామంలో నీటి కొరత కరెంటు సమస్యలు ఉంటే రేపటి సాయంత్రం వరకు ఎంపీడీవో కు సంప్రదించాలని ఎంపీపీ అన్నారు.కార్యదర్శులు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి కరెంటు కోతలు లేకుండా చూడాలని సూచించారు. ఎక్కడైనా నీటి కొరత,కరెంటు సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని అన్నారు. గ్రామాలలో మిగిలిపోయిన అభివృద్ధి పనులను ఎంపీటీసీ సాయంతో ప్రారంభించాలని ఎంపీపీ సూచించారు. గ్రామాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లను ఆయాలను రేషన్ షాప్ డీలర్లను భర్తీ చేసేటట్టు ఉన్నత అధికారులతో మాట్లాడాలని సూచించారు. మునుగోడు నియోజవర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం బెల్ట్ షాపులను పూర్తిగా నిషేధించాలని వినకపోతే కేసు నమోదు చేసి బైండోవర్ చేయించాలని వెంకట్ రెడ్డి ఎక్సైజ్ అధికారులకు చెప్పారు. మల్కాపురం ఎంపిటిసి చిట్టెంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ హైవే హైవేకు ఆనుకొని ఉన్న కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని అధికారుల దృష్టికి తీసుకుపోతే అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెబుతున్నారని అన్నారు.రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి శ్రీనివాసరావుసూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి వైసీపీ ఉప్పు భద్రయ్య తహసిల్దార్ హరికృష్ణ ఎంపీడీవో సందీప్ కుమార్ ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.