
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సుదీర్ఘ కాలం పాటు పని చేస్తున్న ఆంగని వాడి హెల్పర్లకు గతంలో ఉన్న 10వ, తరగతి అర్హతను తీసివేసి ఇంటర్ అర్హత పెట్టడం వల్ల వందలాది మంది హెల్పర్స్ ప్రమోషన్లో అర్హత ను కోల్పోతున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలిపారు.సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు కు వివిధ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 70వేలమంది అంగనీ వాడి ఉద్యోగులూ ఉన్నారని అందులో సగం మంది హెల్పర్స్ పని చేస్తున్నారని, అతి తక్కువ వేతనం తో కేంద్రాలలో ఎక్కువ పని చేస్తున్నా కానీ ప్రభుత్వం హెల్పర్ల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం అన్యాయం ఆన్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం 9వేలమంది నీ మినీ అంగనీ వాడి టీచర్లు గా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుందని ఇప్పటికే ఆరోజు ఉన్న విద్య అర్హత పదవ తరగతి టీచర్లకు ఉందని ఇప్పుడు కొత్తగా ఇంటర్ అర్హత అని ప్రకటించడం హెల్పర్ల కు అన్యాయం చేయడమే తప్ప మరొకటి కాదన్నారు… టీచర్లకు ప్రభుత్వం అదనపు పనులు ఇచ్చినప్పుడు కేంద్రాలను నడిపి పిల్లల భద్రత కాపాడింది హెల్పర్లే నని,అంతేకాకుండా ఉదయము పసి పిల్లలను ఇంటి దగ్గర నుండి అంగనీ వాడి కేంద్రాలకు తీసుక వచ్చి తెలియని వయసు లో పిల్లలు చేసే పనులకు తల్లులు వలే చూసేది అయాలే నని నెమ్మాది తెలిపారు. ఇప్పటి వరకు 10వ తరగతి అర్హత ఉన్న వారిని అకస్మాత్ గా ఇంటర్ అర్హత పెట్టడం ప్రభుత్వం అయాలకు చెసే తీవ్రమైన అన్యాయం తప్ప మరొకటి కాదన్నారు… కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇతర అనేక రాష్ట్రాలలో లాగానే ప్రమోషన్లో పదవ తరగతి అర్హత మాత్రమే పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.మన రాష్ట్రం లో నాలుగు వేల మంది మినీ ఆంగని వాడి టీచర్లకు పదవ తరగతి వరకూ ఉంటే చాలునని ప్రమోషన్ కల్పించి వారికి న్యాయం రాష్ట్ర ప్రభుత్వం చేసిందని ఇప్పుడు కూడ పదవ తరగతి చదువుకున్న హెల్పార్లకు టీచర్లగా ప్రమోషన్ కల్పించాలని నెమ్మాది డిమాండ్ చేశారు.సీఐటీయూ జిల్లా అద్యక్షుడు ఎం రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాక లక్ష్మీ మాట్లాడుతూ వేసవి సెలవులు ఇవ్వాలని, పెరిగిన నిత్య అవసర వస్తువుల ధరలను దృష్టిలో పెట్టుకొని హె ల్పర్లకు కనీస వేతనాలు 26వేలు ఇవ్వాలని, సవంత్సరానికి రెండు జతల కాటన్ దుస్తులు, వంట సామాగ్రి, పండగ అలవెన్సులు, ఆరోగ్య భీమా, ఉద్యోగ భద్రత, అధికార, రాజకీయా వేధింపులు అరికట్టాలని, పి ఎఫ్, ఇ ఎస్ ఐ అమలు చేయాలని, అంగనీ వాడి కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని, రాంబాబు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ చెరుకు యాకలక్ష్మీ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో హెల్పర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ బి విజయ లక్ష్మి, దుర్గ, త్రివేణి, నాగమణి, సౌజన్య, ప్రభావతి, గుగులోత్ బుజ్జి, ఎం దుర్గమ్మ, లక్ష్మమ్మ, రాములమ్మ, మట్టమ్మ , సుగుణ, అంసిలి తదితరులు పాల్గొన్నారు.