ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

– ప్రజల నుండి దరఖాస్తు స్వీకరించిన కలెక్టర్‌
– పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని పరిష్కారాన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు ఇలా ఉన్నాయి….ఎగ్గడి ఇందు, భర్త రాజేశ్వరరావు పెంట్లం గ్రామం అన్నపురెడ్డిపల్లి మండలం తాను సర్టిఫికేషన్‌ ఆఫ్‌ రేడియోగ్రఫీ అసిస్టెంట్‌ కోర్స్‌ చేసి ఉన్నానని, గత సంవత్సరం సెప్టెంబర్‌ 22, 2023న అశ్వరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు గల పోస్టుకు దరఖాస్తు చేసి ఉన్నానని, ఆ పోస్టు ఫిమేల్‌ కేటగిరీకి ఉండగా ఆ పోస్ట్‌కి సంబంధించిన ఎటువంటి సమాచారం లేకుండా వేరే వ్యక్తిని కేటాయించారు. మెరిట్‌ లిస్టులో నేనొకదాన్ని అర్హత కలిగి ఉన్నాను కావున నాకు రావాల్సిన పోస్టు ఇప్పించ వలస వలసినదిగా కోరిన దరఖాస్తూను డిస్టిక్‌ మెడికల్‌ హెల్త్‌ అధికారికి ఎండార్స్మెంట్‌ చేశారు. కరకవాగు గ్రామస్తుడు బి.కృష్ణ పాల్వంచ మండలంలో తాను 2023 సంవత్సరంలో కొత్తగూడెం లక్ష్మీదేవి మండలంలోని రేగళ్ల, భానోజీ తండా ప్రాథమిక పాఠశాలల యందు మన ఊరు మనబడి కార్యక్రమం కింద మేజర్‌, మైనర్‌ పనులు చేసి ఉన్నానని, ఇప్పటివరకు ఎటువంటి బిల్లులు రాలేదని తెలిపారు. రావాల్సిన బిల్లులు ఇప్పించగలరని కోరిన దరఖాస్తును ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పంచాయతీ రాజ్‌కు ఎండార్స్మెంట్‌ చేశారు. ఇల్లందు మండలం మామిడిగూడెం గ్రామపంచాయతీ నిరుపేదలైన రైతులు 1999 సంవత్సరంలో ఫారెస్ట్‌ వారు, వన సంరక్షణ కమిటీ వారు ఏ.బి.కమిటీ చైర్మెన్‌లు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలందరికీ సమక్షంలో ఒక ఒప్పందం గుర్తుంచుకొని మా భూమిలో ఫారెస్ట్‌ వారు జామాయిల్‌ మొక్కలు నాటారని తెలిపారు.
2005 సంవత్సరం వరకు 25 హెక్టర్ల భూమిలో మొక్కలు నాటినట్టు తెలిపారు. కటింగ్‌ పీరియడ్‌ 25 సంవత్సరాలు అయినప్పటికీ, ఫారెస్ట్‌ వారు కటింగ్‌ చేయకుండా జాప్యం చేస్తున్నందున మేము పలు రకాలుగా నష్టపోతున్నామని తెలిపారు. ఈ చెట్టును కటింగ్‌ చేసి వాటిని అమ్మి మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇప్పించగలరని ఫారెస్ట్‌ వారిని వేడుకున్నప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. కావున దయతో తమ డబ్బులు తమకు ఇప్పించగలరని కోరిన దరఖాస్తును డీఎఫ్‌ఓకు పరిష్కారానికి సిఫార్సు చేశారు. తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ఎండార్స్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రవీంద్రనాథ్‌, డీఆర్‌డీ ఏపీడీ విద్యాచందన, జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు.