రహదారి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం

నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని కొత్త దంతెనం గ్రామపంచాయతీలోని ఆర్‌అండ్‌బీ రహదారి నుండి తాలిపేరు కెనాల్‌ వరకు సుమారు 900 మీటర్ల గ్రావెల్‌ రోడ్డు నిర్మాణ పనులతో పాటు సీడీపీ నిధులతో 5లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సోమవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. రహదారుల నిర్మాణాలతోనే ఏజెన్సీ ప్రాంత గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, పార్టీ మండల అధ్యక్షులు అన్నే సత్యనారాయణ మూర్తి, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, ఉపాధ్యక్షులు తునికి కామేశ్వరరావు, అపకా వీర్రాజు, సొసైటీ డైరెక్టర్‌ కాలువ పూర్ణయ్య, సోషల్‌ మీడియా అధ్యక్ష కార్యదర్శులు దామెర్ల శ్రీనివాసరావు, తోట రమేష్‌, ఎస్సి సెల్‌ అధ్యక్షులు మోతుకూరి శ్రీకాంత్‌, విద్యార్థి సంఘం అధ్యక్షులు కొత్త మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.