నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని వీడియోస్ కాలనీ రెజోనెన్స్ ఇన్ఫో పాఠశాల పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుకలు నిర్వహించారు. తొలుత మానసిక వైద్యనిపుణులు డాక్టర్ సతీష్ బాబు, రెజోనెన్స్ డైరెక్టర్స్ ఆర్‌వి. నాగేంద్రకుమార్, కె. శ్రీధర్రావు, నీలిమ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ బాబు మాట్లాడుతూ జీవితంలో ప్రధానమైన అంశాలు తల్లిదండ్రులు, గురువులు, గురువు దేశ ప్రతిష్ట, ఉన్నత శిఖరాలు ఎదగటానికి బాలబాలికలు విద్యార్థి దశ నుండి మంచి క్రమ శిక్షణ తోడ్పడుతుందని, అటువంటి క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన మన రెజోనెన్స్ ఇన్ఫో పాఠశాలలో మాత్రమే జరుగుతుందని తెలిపారు. చదువుతో పాటు గుణం కూడా ముఖ్యం, మన మనసు వెళ్ళిన ప్రతి చోటుకు శరీరం కూడా వెళ్ళాలి అనిపిస్తుందని, మనసుని మంచి పనుల మీద విద్యార్థులు పెట్టాలని, ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడినుండి వచ్చాయనేది గ్రహించాలని, ప్రతి విషయాన్ని క్షుణంగా పరిశీలించాలని, దాని వలన జీవితంలో ఒక గమ్యం ఏర్పడుతుందని, మంచి ప్రవర్తన మనలో కలిగిస్తుందని తెలిపారు. డైరెక్టర్‌ఆర్.వి. నాగేంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించరాదన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ, విద్యార్థులను అన్ని రంగాలలో అభివద్ధి చేస్తూ సామాజిక అవగాహన పెంచే విధంగా విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని ఆయన తెలిపారు. శక్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు విద్యార్థులు కషి చేయాలన్నారు. విద్యార్థి తన జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి చిన్నతనంలో పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానమే దోహదపడుతుందని తెలిపారు. ప్రతి విద్యార్ధి దేశభక్తిని పెంపొందించుకొని సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని తల్లిదండ్రులను, అధ్యాపకులను గౌరవించాలని అన్నారు .డైరెక్టర్ కె. శ్రీధర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు మొదటి గురువులు తల్లిదండ్రులైతే, వారి తరువాత అధ్యాపకులదే ప్రముఖ స్థానమని, కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆటపాటలతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు ముందుండే విధంగా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పాఠశాల దశను ముగించుకొని పై చదువులకు వెళుతున్న విద్యార్థులకు జీవితంలో విజయం సాధించాలంటే నిజాయితీతో కష్టపడాలని అన్నారు . ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా వాటిని అధిగమించాలని తద్వారా విజయానికి చేరువౌతామని తెలిపారు. డైరెక్టర్ నీలిమా మాట్లాడుతూ పాఠశాల జీవితం బంగారం లాంటిదని, ఈ బాల్యం చాలా సున్నితమైనదని, చాలా విలువైనదని, స్కూల్ దశలో వేసే పునాది తదుపరి జీవితకాలం ఉపయోగపడుతుందని తెలిపారు. నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగి చదువుకున్న పాఠశాలకు పేరుతేవాలని అన్నారు . అనంతరం చిన్నారులు ఉత్సాహంతో కేరింతలతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ గోపాలకష్ణ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.