సభాపతి సహకారంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు

– మండలాధ్యక్షుడు రవీందర్‌
నవతెలంగాణ-మర్పల్లి
అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి అభివృద్ధికి వికారాబాద్‌ శాసనసభ్యులు, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎంతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్‌ మర్పల్లి మండలాధ్యక్షులు యు. రవీందర్‌ అన్నారు. సోమవారం మర్పల్లి మండలం బూచన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని జాజిగుబడి తండాలో శాసనసభ్యులు ప్రసాద్‌ కుమార్‌ మంజూరు చేసిన రూ.8 లక్షల నిధులతో సిమెంట్‌ రోడ్డు పనులను కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అభివద్ధికి ఆమడ దూరంగా ఉన్న మర్పల్లి మండలాన్ని సంవత్సరంలోనే అన్ని రంగాల్లో అభివద్ధి పరచడానికి ఎమ్మెల్యే శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. మండల అభివద్ధికి సహకరిస్తున్న సభాపతికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నరసింహారెడ్డి, విలేజ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ బి వెంకటరామిరెడ్డి, మాజీ ప్రెసిడెంట్‌ కే శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎల్‌ ప్రభాకర్‌రెడ్డి, బలవంత్‌రెడ్డి, బిచ్చిరెడ్డి, బక్కారెడ్డి, మాణిక్‌ రెడ్డి, టోప్యానాయక్‌, రామచందర్‌ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.